ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్న పాత్ర: ఒక విశ్లేషణాత్మక సమీక్ష
Author(s): డాII వి.నారాయణప్ప
Abstract: క్రీ.శ.1846లో రాయలసీమ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు లేవదీసిన రాయలసీమ రైతుల పోరాటం స్వాతంత్ర్య సంగ్రామంగా మారింది. ఈ సంగ్రామ చరిత్రలోఒడ్డె ఓబన్న, గోసాయి వెంకన్న పేర్లు ప్రముఖంగా వినబడుతాయి. గోసాయి వెంకన్న, నరసింహారెడ్డికి ఆధ్యాత్మిక గురువు అయితే, ఒడ్డె ఓబన్న రెడ్డిగారి సైన్యానికి ముఖ్యనాయకుడు. క్రీ.శ.1846 అక్టోబరు 6వ తేదీన ఒడ్డె ఓబన్న వీరమరణం పొందిన దినంగా చెబుతున్నారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు కోవెలకుంట్లలో సుమారు రెండువేల మంది ప్రజల సమక్షంలో నరసింహారెడ్డిగారిని అతి క్రూరంగా ఉరితీసి చంపారు ఆనాటి కుంఫిణీ ప్రభుత్వంవారు. ఆ రోజును చీకటిరోజుగా చరిత్ర పేర్కొంటుంది. ఆ సంఘటనలను ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు ‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్నపాత్ర” అనే గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథాన్ని నేను విశ్లేషణాత్మకంగా సమీక్షించాను.
Pages: 207-210 | Views: 152 | Downloads: 66Download Full Article: Click HereHow to cite this article:
డాII వి.నారాయణప్ప. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్న పాత్ర: ఒక విశ్లేషణాత్మక సమీక్ష. Int J Multidiscip Trends 2022;4(2):207-210.